వెంటపడిన అభిమానికి క్లాస్ పీకిన సూపర్ స్టార్

Published on Oct 21, 2019 12:00 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏక్కడికి వెళ్లినా వందలమంది చుట్టుముట్టేస్తుంటారు. తాజాగా ‘దర్బార్’ షూటింగ్ ముగించుకున్న రజనీ హిమాలయాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటన ముగించుకుని ఆయన శుక్రవారం చెన్నై తిరిగి వచ్చారు.

రజనీ రాక గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారిలో ఒక అభిమాని విమానాశ్రయం నుండి ఇంటి వరకు రజనీ ప్రయాణిస్తున్న కారును బైక్ మీద ఫాలో చేశాడట. ఇది గమనించిన సూపర్ స్టార్ ఇంటికి చేరుకోగానే ఆ అభిమానిని ఇంట్లోకి పిలిచి అంత రాత్రి పూట కారును ఫాలో అవడం మంచిది కాదని, ప్రమాదాలు జరుగుతాయని స్మాల్ క్లాస్ ఇచ్చారట.

అంతేకాదు అతని కోరికను మన్నించి ఫోటో దిగే అవకాశం కూడా ఇచ్చారట. ఇకపోతే రజనీ త్వరలో శివ దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టనుండగా ‘దర్బార్’ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More