రాహుల్ కి రజని సపోర్టా…!

Published on May 28, 2019 1:45 pm IST

సూపర్ స్టార్ రజని కాంత్ మీడియా ముఖంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ తన పదవికి రాజీనామా చేయరాదని, ఆయన విజయం సాధించగలడని నిరూపించుకోవాలని, ప్రతిపక్షం అనేది పటిష్టంగా ఉండాలని రాహుల్ కి హితవు పలికారు.తాజాగా రాహుల్ ఓటమికి బాధ్యత వహిస్తూ తన కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజినామా సమర్పించారు. సోనియాతో సహా ఎందరు నచ్చచెప్పినా రాహుల్ ఆ పదవికి ససేమిరా అంటున్నారు.

రజని కొన్ని రోజుల తరువాత పూర్తి స్థాయి రాజకీయాలలోకి రానున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కి రజని అనుకూలమా, అనే సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు లో మేజర్ పొలిటికల్ పార్టీలైన పన్నీరుసెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని “ఏ ఐ ఏ డి ఎం కె” బీజేపీ కి అనుకూలత తెలుపగా, స్టాలిన్ నేతృత్వంలో లోని “డి ఎం కె” కాంగ్రెస్ కూటమికి తమ మద్దతు ప్రకటించింది.

ఏది ఏమైనా రాహుల్ నాయకత్వం పై రజని చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కి కొంచెం అనుకూలాంశమే అని చెప్పాలి. రజని ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న “దర్బార్” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More