రాజమౌళి సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నాడా ?

రాజమౌళి సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నాడా ?

Published on Mar 29, 2018 6:41 PM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , చరణ్ నటించబోతున్న సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ‘గరుడవేగ’ సినిమాతో మంచి విజయం సాధించిన రాజశేఖర్ రాజమౌళి కోసం విలన్ గా మారతాడా లేదా అనేది చూడాలి. ‘ధృవ’ సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించాలి కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాలో రాజశేఖర్ నటించలేదు.

రాజమౌళి విలన్ పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించారని వార్తలు వస్తున్నప్పటికీ అందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరుకు ఆగాల్సిందే. గతంలో రాజశేఖర్ పాత్ర, కథ బాగుంటే ప్రతినాయకుడిగా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ పోలీస్ పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమా అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది.

తాజా వార్తలు