సుకుమార్ చేతులమీదుగా “రాజావారు రాణిగారు” ట్రైలర్ లాంచ్

Published on Nov 20, 2019 11:55 am IST

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేస్తున్నారు. నిన్న ఈ చిత్ర ట్రైలర్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. సందీప్ కిషన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి టీమ్ ని విష్ చేశారు. కాగా రాజా వారు రాణిగారు ట్రైలర్ అన్నివర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తలు కురిపిస్తున్నారు.

డిఫరెంట్ ఏజ్ గ్యాప్స్ లో నడిచే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యంలో స్కూల్ ఏజ్ లవ్ స్టోరీ మూవీకి హైలెట్ కానుంది. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More