మే 29న ప్రేక్షకుల ముందుకు రాజేంద్ర ప్రసాద్ ‘నేనెవరు?’

మే 29న ప్రేక్షకుల ముందుకు రాజేంద్ర ప్రసాద్ ‘నేనెవరు?’

Published on May 26, 2026 9:00 AM IST

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘నేనెవరు?’ మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు సాయికిరణ్, జోగిని శ్యామల ఇతర కీలక పాత్రలు పోషించారు. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాల చుట్టూ తిరుగుతుంది. టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ఓ ప్రశ్న ఆధారంగా కథనాన్ని రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ పాత్ర, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయని మేకర్స్ తెలిపారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి నెలకొందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి చిన్నికృష్ణ సంగీతం అందించగా, నాయుడు ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘నేనెవరు?’ ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది.

తాజా వార్తలు