నా మద్దతు ఎవ్వరికీ లేదంటున్న సూపర్ స్టార్.

Published on Dec 8, 2019 8:36 pm IST

రజిని కాంత్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ గతంలో ఓ రాజకీయ పార్టీని ప్రకటించారు. రజిని మక్కల్ మండ్రమ్ అనే పార్టీని ఓ యోగ ముద్ర సింబల్ ఉన్న ఓ ప్లాగ్ ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఐతే పూర్తి స్థాయిలో ఆయన తన పార్టీని సన్నద్ధం చేసింది లేదు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ఆయన పోటీ చేసే అవకాశం కలదు. కాగా ఈనెల 27 నుండి 30వరకు తమిళనాడు లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ లో రజిని పార్టీ పోటీచేయడం లేదు. అలాగే ఏపార్టీ వారైన రజిని మక్కల్ మండ్రమ్ జెండాలు కానీ, పేరుకాని ఉపయోగించరాదని ప్రకటన చేయడం జరిగింది. మా పార్టీ మద్దతు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

కాగా రజిని నటించిన దర్బార్ మూవీ ఆడియో వేడుక నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరిలో విడుదల అవుతుండగా నయనతార రజిని కి జంటగా నటిస్తున్నారు. అనిరుధ్ దర్బార్ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More