కమల్ తో సినిమాకు రజినీ షాకింగ్ రెమ్యూనరేషన్..?

Published on Jul 7, 2020 1:45 pm IST

మన దేశంలోనే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. అయితే రజినీ ప్రస్తుతం అక్కడి స్టార్ డైరెక్టర్ శివతో “అన్నాత్తే” అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తలైవర్ విశ్వ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో రీసెంట్ హిట్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి బయటకు వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఒక క్రేజీ రూమర్ వినిపిస్తుంది. నిర్మాత కమల్ ఈ చిత్రానికి గాను రజనీకి భారీ పారితోషకం ఇవ్వనున్నారని తెలుస్తుంది. అది చిన్న నెంబర్ కూడా కాదు. రజిని ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.

ఇది ఎంత వరకు నిజమో కానీ ఇప్పుడు దర్శకుడు శివతో నటిస్తున్న సినిమాకు కూడా తలైవర్ ఇంతే స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా వినికిడి. మాములుగానే రజినీ హైయెస్ట్ పైడ్ హీరో అని అందరికీ తెలుసు కానీ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్న దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More