ఐదుసార్లు డబుల్ సెంచరీ…సూపర్ స్టార్ కే సాధ్యం..!

Published on Jan 21, 2020 10:34 am IST

సూపర్ స్టార్ రజిని ఎవరికి సాధ్యం కానీ రికార్డ్స్ నమోదు చేస్తున్నారు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ కింగ్ గా తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం దర్బార్ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళుతోంది. తాజాగా ఈ మూవీ 200 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరింది. నిన్నటితో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి 200కోట్ల రూపాయల వసూళ్లకు చేరుకుంది. 200కోట్ల వసూళ్లను సాధించిన రజిని ఐదవ చిత్రంగా దర్బార్ నిలిచింది. ఐదు సార్లు డబుల్ సెంచరీ సాధించి సౌత్ చిత్ర పరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ గా రజిని నిలిచాడు.

గతంలో ఆయన నటించిన రోబో, కబాలి, 2.0, పేట చిత్రాలు 200కోట్ల వసూళ్లను చేరుకున్నాయి. దర్బార్ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించారు. రజినీకి హీరోయిన్ గా నయనతార నటించగా, నివేదా థామస్ కూతురిగా చేయడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More