మాస్ అవతార్ లో తలైవర్..”అన్నాత్తే” ఫస్ట్ లుక్ వచ్చేసింది.!

Published on Sep 10, 2021 11:55 am IST


ఇండియన్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అన్నాత్తే” నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇప్పుడు వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేసారు. తలైవర్ స్వాగ్ తో పక్కా మాస్ అండ్ స్టైలిష్ గా ఈ ఫస్ట్ లుక్ ని తీర్చి దిద్ది వదలగా దీనికి భారీ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. పంచె కట్టులో కళ్లద్దాలు పెట్టుకొని ఏదో సాంగ్ లో సెలబ్రేషన్స్ లో పోస్టర్ లా ఉంది.

మొత్తానికి మాత్రం ఈ మాస్ అవతార్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో రజినీ అభిమానులు మంచి ఖుషీగా ఉన్నారు. ఇక దీనిని పక్కన పెడితే ఈరోజు సాయంత్రం రానున్న మోషన్ పోస్టర్ టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అక్కడి స్టార్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ మరియు మీనా లు కీలక పాత్రల్లో నటిస్తుండగా డి ఇమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :