‘కాల’ కోసం ముంబై చేరుకున్న రజినీ !

28th, May 2017 - 01:05:28 PM


సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కాల’ ఈరోజు ఉదయం ముంబైలో మొదలైంది. రజనీకాంత్ కూడా షూటింగ్లో పాల్గొనేందుకు ఈరోజు పొద్దున్నే ముంబై చేరుకున్నారు. ముంబై మాఫియా నైపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. ఇందులో రజనీ ముంబైలోని దారావి అనే ఏరియాలో తమిళుల కోసం పోరాడే కరికాలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి కథానాయకిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్ కి విపరీతమైన స్పందన లభించడం, రజనీ గత చిత్రం ‘కబాలి’ ని డైరెక్ట్ చేసిన పా.రంజిత్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా ఎలా ఉండబోతోందో అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఎక్కువైంది. ఇకపోతే ఈ ప్రాజెక్టును రజనీ మేనల్లుడు, స్టార్ హీరో అయిన ధనుష్ నిర్మిస్తుండటం విశేషం.