అవసరమైతే కమల్‌తో చేతులు కలుపుతానంటున్న రజనీ

Published on Nov 20, 2019 9:59 pm IST

తమిళ రాజకీయాల్లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిస్తే బాగుంటుందనేది ఎన్నాళ్ళగానో జనంలో ఉన్న అభిప్రాయం. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు మీడియా ప్రశ్నించగా దాటవేస్తూ వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు మాత్రం కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్టు సంకేతాలిస్తున్నారు. కమల్ కొన్నిరోజుల క్రితమే తన మిత్రుడు రజనీతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్దమేనని స్టేట్మెంట్ ఇవ్వగా తాజాగా రజనీకాంత్ సైతం అందుకు అనుగుణంగానే మాట్లాడారు.

గోవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవానికి బయలుదేరిన రజనీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజల బాగు కోసం అవసరమైతే తన చిరకాల మిత్రుడు కమల్‌తో కలుస్తానని అన్నారు. దీంతో అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇకపోతే ప్రస్తుతం రజనీ ‘దర్బార్’ సినిమా కంప్లీట్ చేసి శివ డైరెక్షన్లో కొత్త సినిమా చేయడానికి సిద్దమవుతుండగా కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More