‘స్పైడర్’ ను ప్రశంసించిన సూపర్ స్టార్ !
Published on Sep 28, 2017 5:10 pm IST

మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’ భారీ స్థాయిలో నిన్న విడుదలై మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు రూ.120 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఈ చిత్రంతో మహేష్ కోలీవుడ్లో అఫీషియల్ గా లాంచ్ అయ్యారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ‘స్పైడర్’ స్పెషల్ షోను వీక్షించి ‘సినిమా చాలా బాగుంది. మంచి యాక్షన్ తో పాటే మెసేజ్ ను కూడా ఇచ్చారు. మహేష్ నటన చాలా బాగుంది. మురుగదాస్ సబ్జెక్టును చల్ బాగా హ్యాండిల్ చేశారు. ఇంత మంచి సినిమాను ఇచ్చినందుకుగాను యూనిట్ మొత్తానికి అభినందనలు’ అంటూ ప్రశంసించారు. సూపర్ స్టార్ మాటల వలన సినిమాకు తమిళనాట ఇంకాస్త క్రేజ్ పెరిగే ఛాన్సుంది.

 
Like us on Facebook