రికార్డ్ వ్యూస్ సాధిస్తున్న రజనీ ‘దర్బార్’

Published on Nov 8, 2019 10:00 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘దర్బార్’ యొక్క మోషన్ పోస్టర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, మోహన్ లాల్ లాంటి స్టార్ల చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ విడుదలైంది. విడుదలైన మరుక్షణమే వైరల్ అయిన మోషన్ పోస్టర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రజనీ ఎలివేషన్ గొప్పగా కుదరడంతో ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ మోషన్ పోస్టర్ను వీక్షిస్తున్నారు. ఇప్పటివరకు తమిళ వెర్షన్ పోస్టర్ 3 మిలియన్ల వరకు వ్యూస్ సాధించగా తెలుగు, హిందీ, మలయాళం పోస్టర్స్ అన్నీ కలిపి 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నాయి. మొత్తానికి మోషన్ పోస్టర్ బాగా క్లిక్ అయింది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా మెరవనుండగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More