సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన అవైటెడ్ సీక్వెల్ సినిమా ‘జైలర్ 2’ తో ఈ అక్టోబర్ లో రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు సిద్ధం అవుతున్నాయి. అయితే వీటిలో రజినీకాంత్ మరియు డ్రాగన్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కలయికలో చేస్తున్న సినిమా ‘ధర్మన్’ కూడా ఒకటి.
ఫస్ట్ లుక్ ఇంకా సెకండ్ లుక్ పోస్టర్ లతో మంచి హైప్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా షూట్ ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా దర్శకుడు అశ్వత్ నేరుగా సెట్స్ నుంచి షూటింగ్ ఫోటో షేర్ చేసుకొని సినిమాపై అప్డేట్ అందించారు.
దీనితో ధర్మన్ మాత్రం ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహిస్తుండగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
From the sets of #Dharman ⭐️ pic.twitter.com/Clxaxv8tfA
— Ashwath Marimuthu (@Dir_Ashwath) July 5, 2026


