సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లింగ’. ఈ సినిమాలో తలైవా రజినీకాంత్ పై వచ్చే ఒక్క ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ని హాంకాంగ్, దుబాయ్, మెక్కా లోకేషన్స్ లో షూట్ చేయడానికి ప్లాన్ చేసారు. అందులో భాగంగా ఈ పాటని దుబాయ్ లో మొదలుయ్ పెట్టారు. ప్రసతుతం దుబాయ్ లో ఈ చిత్ర టీం రజినీకాంత్ పై ఈ పాటని చాలా స్టైలిష్ గా షూట్ చేస్తున్నారు. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి రజినీకాంత్ తన డబ్బింగ్ పార్ట్ ని కూడా పూర్తి చేసాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేయనున్నారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాల తర్వాత రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


