కేంద్రంపై రజనీ ఫైర్

Published on Feb 27, 2020 3:00 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే వదంతులు ఛాన్నాళ్ల నుండి ప్రచారంలో ఉన్నాయి. తాజాగా సీఏఏను ఆయన సపోర్ట్ చేయడంతో ఆ వదంతులు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఈరోజు రజనీ కేంద్రం మీద ఫైర్ అయ్యారు.. తాను భాజాపా మనిషిని కాదని తెగేసి చెప్పేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై మాట్లాడిన రజనీ ఇలా నిరసనలు హింసాత్మక రూపంలోకి మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఇలాంటి హింసను ఉక్కు పిడికిలితో అణచివేయాలి. అలా చేయడం రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. సిఏఏ వలన ఏ ముస్లిం నష్టపోయినా వారికి సపోర్ట్ చేసే మొదటి వ్యక్తిని నేనే అంటూ తాను భాజాపా మనిషిని కాదని, అలాంటి వార్తలు రావడం విచారకరమని అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More