తన ఆరోగ్యం పై వచ్చిన వార్తలపై స్పష్టతనిచ్చిన రజినీ

Published on Oct 29, 2020 7:15 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో తన పొలిటికల్ పార్టీని లాంచ్ చేయాల్సి ఉంది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతానని ఆయన ఇదివరకే చెప్పారు. కానీ ఆయన్నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో ఇదే సమయంలో రజినీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలు విరమించుకున్నారని వార్తలొచ్చాయి. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. కనుక ఈ కోవిడ్ సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచించారని అందుకే రజినీ రాజకేయాల్లోకి రావట్లేదని ప్రచారం జరిగింది. ఇది అభిమానుల్లో గందరగోళాన్ని క్రియేట్ చేసింది.

దీంతో నేరుగా రజినీకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లేఖ తాను రాసింది కాదని, రాజకీయాల్లోకి రావాలనుకోవడంలేదనే వార్త వాస్తవం కాదని అన్నారు. కానీ తన ఆరోగ్యంపై వినిపిస్తున్న వార్తలు మాత్రం నిజమని చెప్పుకొచ్చారు. అంటే ఆయన తనకు అమెరికాలో కిడ్నీ మార్పిడి చికిత్స జరిగినట్టు ఒప్పుకున్నట్టే. అయితే ఇప్పుడు మాత్రం తాను పూర్తి ఆరోగ్యాంగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. అలాగే రజినీ మక్కల్ మండ్రం సభ్యులతో మాట్లాడి ఎన్నికల్లో పోటీచేసే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తానని కూడ అన్నారు. ఇకపోతే రజినీ తాజా చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్ కూడ రీస్టార్ట్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More