‘లింగా’ లో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రజనీ రెండు కాకుండా మూడు పాత్రలు పోషిస్తున్నారని వినికిడి. రజనీ పోషిస్తున్న మూడో పాత్ర కొద్ది సేపు మాత్రమే కనిపిస్తుంది. ముల్లైపెరియార్ డాం యొక్క ఆర్కిటెక్ట్ జాన్ పెన్నీక్విక్ పాత్ర ని రజనీ పోషించవచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘లింగా’ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది.


