సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రాజు గారి గది 2’
Published on Oct 7, 2017 1:28 pm IST


ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన రాజు గారి గది 2 చిత్రం అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి యూ /ఏ సర్టిఫికేట్ ని కేటాయించారు. 124 నిమిషాల నిడివితో ఈ చిత్రం రాబోతోంది.

హర్రర్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి ఓం కార్ దర్శకత్వం వహించారు. నాగార్జున, సమంత ప్రధాన పాత్రలలో నటించారు. పివిపి, మాట్ని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఓం కార్ సినిమా నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఈ నెల 13 న విడుదల కాబోతోంది.చిన్న చిత్రంగా వచ్చిన రాజు గారి గది పెద్ద విజయం సాధించింది. దీనితో రాజు గారి గది 2 పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

 
Like us on Facebook