సెన్సార్ చేయించుకున్న ‘రాక్షసుడు’ !

Published on Jul 29, 2019 6:10 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “రాక్షసుడు”. తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం.

స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సైకో కిల్లర్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి సైకో కిల్లర్ ను పట్టుకునే ఇన్వెస్టిగేట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆసక్తిరంగా ఉండటంతో సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ‘ఏ స్టూడియోస్’, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :