రాక్షసుడు రన్ టైం ఎంతంటే?

Published on Aug 1, 2019 11:21 am IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. టీనేజ్ గర్ల్స్ ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.

ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకోవడం జరిగింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అలాగే రాక్షసుడు చిత్ర నిడివి 149 నిమిషాలని సర్టిఫికేట్ చుస్తే అర్థం అవుతుంది. దాదాపు రెండున్నర గంటలు సాగే ఉత్కంఠ రేపే సన్నివేశాలతో సాయి శ్రీనివాస్ అలరించనున్నారన్న మాట.

ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, రాజీవ్ కనకాల,శరవణన్,రాధా రవి,వినోద్ సాగర్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :