రాక్షసుడు మూవీ నైజాం కలెక్షన్స్

Published on Aug 3, 2019 12:29 pm IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “రాక్షసుడు” నిన్న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి షో నుండే రాక్షసుడు చిత్రానికి ప్రేక్షకులు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఉత్కంఠంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ అందరిని బాగానే ఆకట్టుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది.

మొదటిరోజుకు గాను ఈ చిత్రం నైజాం ఏరియాలో 56లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించడం జరిగింది. ఓపెనింగ్స్ ఆశించినంతగా లేకున్నా మౌత్ టాక్ బాగుండటంతో మిగిలిన శని,ఆది వారాంత దినములలో కలెక్షన్స్ పెరిగే అవకాశం కలదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రధాన ఫిలిం న్యూస్ మాధ్యమాలు ఈ చిత్రానికి మంచి రేటింగ్ ఇవ్వడంతో కలెక్షన్స్ కి అనుకూలించే అవకాశం కలదు.

దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. రాజీవ్ కనకాల, వినోద్ సాగర్, నాన్ శరవణన్, రాధారవి ముఖ్యపాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :

More