“రాక్షసుడు” మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు వేదిక సిద్ధం.

Published on Jul 29, 2019 8:19 pm IST

బెల్లకొండ శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం “రాక్షసుడు”. దర్శకుడు రమేష్ వర్మ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. టీనేజ్ గర్ల్స్ ని కిడ్నాప్ చేసి అతికిరాతంగా హతమార్చే సైకో కిల్లర్ ని వెంటాడే పోలీస్ గా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. కాగా ఈ మూవీ ఆగస్టు 2న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జెఆర్సీసి కన్వెన్షన్ హాల్ లో రేపు సాయంత్రం 6గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరుపనున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఐతే ఈ వేడుకకు ముఖ్య అతిధి ఎవరు అనేది ఇంకా తెలియాల్సివుంది. హవీష్ పిక్చర్స్ ,అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా “రాక్షసుడు” చిత్రానికి జిబ్రాన్ స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం :