‘రాక్షసుడు’ నైజాం 3వ రోజు కలెక్షన్స్ !

Published on Aug 5, 2019 10:38 am IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “రాక్షససుడు” విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నైజాం ఏరియాలో మూడవ రోజు నాడు రూ . 8414843 లక్షల షేర్ ను వసూలు చేసింది. మొత్తం మీద ఈ చిత్రం మూడు రోజులకు గానూ నైజాం షేర్ రూ . 2,12,85,095 కోట్లు సాధించింది.

మొత్తానికి నైజాంలో కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లునే సాధించింది. ఉత్కంఠభరింతగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ అన్ని ఏరియాల ఆడియన్స్ కూడా బాగానే ఆకట్టుకుంది. పైగా ఈ రోజు సోమవారం నాడు ముందస్తు బుకింగ్‌ లు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక వారాంతపు రోజుల్లో కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం కలదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. రాజీవ్ కనకాల, వినోద్ సాగర్, నాన్ శరవణన్, రాధారవి ముఖ్యపాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :