మహేష్ మూవీకి ఇంకా సైన్ చెయ్యని రకుల్ ప్రీత్

మహేష్ మూవీకి ఇంకా సైన్ చెయ్యని రకుల్ ప్రీత్

Published on May 18, 2015 5:00 PM IST

Rakul-Preet-and-mahesh-babu
వరుస విజయాలతో టాలీవుడ్ లో లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ గా టాప్ హీరోయిన్స్ లిస్టులో ఒకరుగా చేరిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ కెరీర్లో ఏ మాత్రం ఖాళీగా లేకుండా తెలుగు, హిందీ అంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తను రామ్ సరసన నటించిన ‘పండగ చేస్కో’ సినిమా మే 29న రిలీజ్ కి సిద్దమవుతుంటే, రవితేజ సరసన నటించిన ‘కిక్ 2’ సినిమా జూన్ మొదట్లో రిలీజ్ కానుంది. ఇవి కాకుండా రామ్ చరణ్ – శ్రీను వైట్ల, ఎన్.టి.ఆర్ – సుకుమార్ ల సినిమాకి సైన్ చేసింది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీ కాంత్ అడ్డాల కాంబినేషన్ లో త్వరలోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ని ఎంపిక చేసారని గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని తన ముందు ప్రస్తావిస్తే ‘మహేష్ బాబు సినిమా ఆఫర్ వచ్చింది. కానీ ఇంకా సైన్ చెయ్యలేదు. నా డేట్స్ అన్నీ మా మేనేజర్ చూసుకుంటాడు, నేను వెళ్లి నటించి వస్తాను. ఇప్పటికే రెండు పెద్ద సినిమాలకు డేట్స్ ఇచ్చేయడం వలన మేనేజర్ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నట్టు ఉన్నాడు. త్వరలోనే తను ఈ విషయంపై ఓ క్లారిటీకి ఇస్తాడని’ రకుల్ ప్రీత్ తెలిపింది. జూన్ నుంచి మహేష్ బాబు బ్రహ్మోత్సవం సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు