క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. తన తండ్రి విశ్వ విఖ్యాత నటరత్నఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం లో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక ముఖ్య పాత్రలో నటించనుందని సమాచారం . ఇక ప్రకాష్ రాజ్, మోహన్ బాబు , విద్యాబాలన్, నరేష్ , సచిన్ కెడ్కర్ తదితర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


