‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని టాలీవుడ్ లో అందరినీ తన వైపు తిప్పుకొని ఆ తర్వాత వరుస హిట్స్ తో టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా జాక్ పాట్ కొట్టేసిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తను నటించిన ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’ సినిమాలు వెంట వెంటనే రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నాయి. ఇవి కాకుండా రకుల్ ప్రీత్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా, ఎన్.టి.ఆర్ సరసన్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి, వాటికి కూడా త్వరలోనే రకుల్ సైన్ చేసే అవకాశం ఉంది.
తాజాగా ఈ భామ బాలీవుడ్ హాట్ బ్యూటీ మరియు టాప్ హీరోయిన్ అయిన దీపిక పడుకునేని తెగ పోగిడేస్తోంది. తనలా పొగడటానికి కారణం దీపిక చేసిన పీకు సినిమా రకుల్ ప్రీత్ కి తెగ నచ్చేయడమే.. ‘పికు సినిమాలో దీపిక పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఇప్పటి వరకూ హీరోయిన్స్ ని చూసే విధానం ఈ సినిమా రీ డిఫైన్ చేసింది. నా మొత్తం కెరీర్ లో నాకు ఒక్కసారైనా అలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని’ రకుల్ ప్రీత్ తెలిపింది. రకుల్ ప్రీత్ తెలుగులోనే కాకుండా హిందీలో చేసిన ‘శిమ్లా మిర్చి’ సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ తో కలిసి స్పెయిన్ లో స్టెప్స్ వేస్తోంది.


