కొత్త ప్రయత్నాల్లో రకుల్ ప్రీత్ సింగ్

Published on Dec 26, 2019 10:59 am IST

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఇకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే కొత్త తరహా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఈమధ్య కాలంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అందుకే అటువైపుగా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటోంది ఆమె. సినిమాల్లో దొరకని కొత్తదనం ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో దొరుకుతుందని అంటోంది.

అలాగని ఏది పడితే అది కాకుండా మంచి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తానని, అవి కొత్తగా, ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని భావిస్తోంది. రకుల్ ఇంతలా డిజిటల్ కంటెంట్ మీద ఆసక్తి చూపుతోంది అంటే ఆమె వద్దకు ఏదో మంచి ప్రాజెక్టే వచ్చి ఉండాలి. ఇకపోతే రకుల్ ప్రస్తుతం తమిళంలో కమల్ హాసన్ చేస్తున్న ‘ఇండియన్ 2’, శివ కార్తికేయన్ కొత్త సినిమా చేస్తూనే హిందీలో ఒక చిత్రం చేస్తోంది.

సంబంధిత సమాచారం :

More