బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్

Published on Oct 20, 2015 6:31 PM IST

rakul-preethi1
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి ఓ మీడియం బడ్జెట్ సినిమాతో సక్సెస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. లేటెస్ట్ గా వచ్చిన బ్రూస్ లీ సినిమాతో రకుల్ ప్రీత్ అందరి మనసును కొల్లగొట్టడమే కాకుండా స్టార్ట్ హీరోయిన్ లీగ్ లో చేరిపోయింది. దాంతో ఈ భామ రేమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. ఎందుకలా పెంచారు అని అడిగితే డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెంచడంలో తప్పు లేదు కదా అంటోంది.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ యంగ్ హీరో సరసన సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒకలైలా కోసం’ ఫేం విజయ్ కుమార్ కొండ తన నెక్స్ట్ సినిమాని అల్లుడు శీను ఫేం బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయనున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. తన కుమారుడు మొదటి సినిమా కోసం సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని పెట్టిన బెల్లంకొండ సురేష్ ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్నిక చేసాడు. రకుల్ ప్రీత్ తీసుకుంటున్న దానికంటే కాస్త ఎక్కువే రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం వలన రకుల్ ప్రీత్ కూడా డేట్స్ సినిమా చెయ్యడానికి ఓకే చేసేసింది. ఒకవైపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూనే మరోవైపు ఇలా వచ్చిన ఆఫర్స్ ని కూడా సద్వినియోగం చేసుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు