షూటింగ్లో లేనప్పుడు ఎన్టీఆర్‌ను మిస్సవుతానంటున్న చరణ్

Published on Jan 17, 2020 4:05 pm IST

ఈ సంవత్సరం విడుదలకానున్న చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ అతి పెద్దది. రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటం వలన ప్రాజెక్ట్ మీద హైప్ రావడం ఒక ఎత్తైతే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తుండటం సినిమా మీద విపరీతమైన అంచనాల్ని క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం కలిసి పనిచేయడం పట్ల రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.

ఎన్టీఆర్‌తో కలిసి వర్క్ చేయడం అంటే తనకెంతో ఇష్టమంటున్న చరణ్ షూటింగ్లో ఎన్టీఆర్ ఉంటే చాలా సందడిగా ఉంటుందని, ఒకవేళ తారక్ షూటింగ్లో లేకపోతే అతన్ని మిస్సవుతానని అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్, తాను చాలా కాలం నుండి స్నేహితులం కావడం వలన చాలా సులభంగా షూటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More