లేటెస్ట్ : తల్లితండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు

లేటెస్ట్ : తల్లితండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Published on Dec 12, 2022 3:36 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకడు శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక కొన్నేళ్ల క్రితం తన స్నేహితురాలు ఉపాసన ని ప్రేమించి వివాహం చేసుకున్న రామ్ చరణ్, కొన్నేళ్లుగా ఆమెతో అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, తమ కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన తల్లితండ్రులు కాబోతన్నారని, త్వరలో మా ఇంట ఒక బిడ్డ రాబోతోందని అంటూ కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసారు. హనుమంతుని దివ్య ఆశీస్సులతో చరణ్ దంపతులు తల్లితండ్రులు కాబోతున్న విషయం మీ అందరికీ ఆనందంతో తెలియచేస్తున్నాను అంటూ చిరంజీవి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు