రామ్ చరణ్ మరో సినిమా హక్కుల్ని దక్కించుకున్నారా ?

Published on Feb 18, 2020 3:00 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారిన తర్వాత ఇతర పరిశ్రమల్లో విజయం సాధించిన చిత్రాల హక్కుల్ని దక్కించుకోవడంపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే మలయాళంలో హిట్టైన మోహన్ లాల్ చిత్రం ‘లూసిఫర్’ హక్కుల్ని కొనుగోలు చేశారు చెర్రీ. దీన్ని తండ్రి చిరంజీవితో నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే వీలుంది.

ఇకపోతే తాజాగా ఆయన ఇటీవల విజయం సాధించిన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కుల్ని కూడా కొన్నట్టు వార్తలొస్తున్నాయి. మంచి స్టోరీ లైన్ కలిగిన ఈ చిత్రాన్ని యంగ్ మెగా హీరోల్లో ఒకరితో నిర్మించాలని చరణ్ భావిస్తున్నారట. ఈ వార్తే నిజమైతే ఆసక్తికరమైన కథలో నటించబోయే మెగా హీరో ఎవరో చూడాలి. ఇకపోతే చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :