
దసరా కానుకగా రిలీజ్ అయిన ‘బ్రూస్ లీ’ సినిమా మంచి హిట్ అందుకోవడం రామ్ చరణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోపే మళ్ళీ వెండితెరపై రామ్ చరణ్ సందడి చేయనున్నాడు. కానీ విజువల్ పరంగా కాదు కేవలం తన వాయిస్ తో మాత్రమే ఈ సారి కనువిందు చేయనున్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నారని, ఈ తెలుగు వెర్షన్ లో సల్మాన్ ఖాన్ పాత్రకి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పనున్నాడని ఇది వరకే తెలియజేశాం.
ప్రస్తుతం రామ్ చరణ్ కంటిన్యూగా ఈ సినిమాకి డబ్బింగ్ చెబుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి చాలా తక్కువ సమయం ఉండడం వలన రామ్ చరణ్ చకచకా తన పార్ట్ డబ్బింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. రామ్ చరణ్ తన డబ్బింగ్ వర్క్ ని ఫినిష్ చెయ్యగానే చిరు 150వ సినిమా స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసే పనిలో బిజీ అవుతాడు. ఈ రెండు నెలల్లో చిరు 150వ సినిమాని ఫైనలైజ్ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఫినిష్ చేసి జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళేలా చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.

