తల్లి సురేఖ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన చరణ్

Published on Feb 18, 2020 2:00 pm IST

మెగా పవర్ స్టార్ చరణ్ తన తల్లి సురేఖ పుట్టినరోజు వేడుకలు స్వగృహంలో జరిపారు. చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఆయన అమ్మగారైన సురేఖ గారి పుట్టినరోజు సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు, ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆనందం పంచుకున్నారు. ఈ సంధర్భంగా చరణ్, ఉపాసన ఆమె దీవెనలు అందుకున్నారు. చరణ్, తల్లికి విలువైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇక రామ్ చరణ్ నిర్మాతగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఓ ప్రక్క తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే మరో వైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ తాజా షెడ్యూల్ మొదలుకాగా ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ మరియు చరణ్ పాల్గొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More