ఇలాంటి అభిమానులు ఉన్నందుకు గర్వంగా ఉందన్న రామ్ చరణ్ !
Published on Aug 6, 2017 8:20 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎల్లప్పుడూ అభిమానుల పట్ల ఎంత సౌమ్యంగా, కృతజ్ఞతగా ఉంటారో చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ను గుర్తుచేసుకోవాల్సిన ప్రతి స్సందర్భంలోను ఆయన వారిని గుర్తుచేసుకుని థ్యాంక్స్ చెబుతుంటారు. తాజాగా ఈరోజు స్నేహితుల దినోత్సవం రోజున కూడా చరణ్ అభిమానుల్ని గుర్తుచేసుకున్నారు.

ప్రత్యేకంగా యూఎస్ లో 40 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, అందులో 10 ని విజయవంతంగా పూర్తి చేసి నేరుగా 627 మంది జీవితాలను కాపాడిన అభిమానుల గురించి ప్రస్తావించి వారికి కృతజ్ఞతలని, చిరంజీవిగారి ఆశయాలను ఇలా ముందుకు తీసుకెళుతున్న అభిమానులు ఉన్నందుకు చాలా గర్వాంగా ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా మెగా హీరోల పుట్టినరోజుల సందర్బంగా ఎన్నో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరికో సహకారం అందించి, నేత్రదానం వంటి పలు ఇతర సేవా కార్యక్రమాల్లో అభిమానులు ముందున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook