గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో చరణ్ మాస్ అవతారంలో కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, గ్లింప్స్‌లకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మైసూరులో జరుగుతోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సాంగ్‌ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న ఈ సాంగ్‌లో వెయ్యి మంది డాన్సర్లు కనిపిస్తారని తెలుస్తోంది. ఇటీవల ఈ సాంగ్ షూట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా రామ్ చరణ్ ఈ సాంగ్ షూట్‌కు బ్రేక్ ఇచ్చాడు. చరణ్ అమ్మమ్మ, అల్లు అరవింద్ తల్లిగారు అల్లు కనకరత్నం శనివారం కన్నుమూశారు.
దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీలో నెలకొన్న విషాదానికి పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


