
ప్రస్తుతం రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత చేయబోయే కొత్త సినిమాలో చరణ్ న్యూ లుక్ లో దర్శనం ఇవ్వనున్నాడు. ‘గోవిందుడు ..’ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తర్వాత ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నాడు. బహుశా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఉండొచ్చు. ఈ కొత్త సినిమాలో సరికొత్త లుక్ లో చరణ్ కనిపిస్తారు.
బాలీవుడ్ టాప్ హీరోలైన హృతిక్ రోషన్(బ్యాంగ్ బ్యాంగ్) , ఫర్హాన్ అక్తర్(భాగ్ మిల్ఖా భాగ్)లకు ట్రైనర్ గా పని చేసిన సమీర్ జురాను తన ట్రైనర్ గా నియమించుకున్నాడు. ప్రస్తుతం సమీర్ తన ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేశారు. ప్రతి రోజు రామ్ చరణ్ 4 గంటల పాటు ఈ ట్రైనింగ్ లో పోల్గొంటాడు. డైటింగ్ విషయంలో ట్రైనర్ సలహాలు పాటిస్తున్నాడు.