సుమ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన రామ్ చరణ్.!

Published on Nov 6, 2021 2:00 pm IST

తెలుగు బుల్లితెర దగ్గర నెంబర్ 1 యాంకర్ ఎవరన్నా ఉన్నారు అంటే ఎవరైనా సరే అది సుమ కనకాల అనే చెబుతారు. అయితే తాను యాంకర్ గా స్థిరపడక ముందు పలు సినిమాల్లోని సీరియల్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కానీ సుమ ప్రధాన పాత్రలో ఫుల్ ఫ్లెడ్జ్ గా నటించిన లేటెస్ట్ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రివీల్ చేసి సుమ సిల్వర్ స్క్రీన్ కి వెల్కమ్ చెప్పారు.

ఈ చిత్రానికి “జయమ్మ పంచాయితీ” అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యగా దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సినిమా నేపథ్యాన్ని అంతా సుమ చీర కొంగులో చూపిస్తూ ఆసక్తిగా దీనిని డిజైన్ చేసారు. మరి ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వం వహిస్తుండగా లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే బలగ ప్రకాష్ నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :