చరణ్, ఎన్టీఆర్ పంచులు.. చిరుకు సర్దిచెబుతున్న రాజమౌళి

Published on Mar 27, 2020 2:02 pm IST

ప్రస్తుతం ట్విట్టర్ మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హడావుడే నడుస్తోంది. ఈరోజు చరణ్ పుట్టినరోజు కావడంతో భీమ్ ఫర్ రామరాజు పేరుతో ఒక వీడియో రూపొందించారు టీమ్. ఆ వీడియోను ఎన్టీఆర్ విడుదలచేయాల్సి ఉంది. కానీ ఆ వీడియోను ఫైనల్ ఒపీనియన్ కోసం రాజమౌళికి పంపానని, అదెప్పుడు వస్తుందో తెలీదని చరణ్ కు ట్వీట్ చేశారు ఎన్టీఆర్. దానికి చెర్రీ ఆయనకు పంపావా.. ఎప్పుడొస్తుంది అంటూ రాజమౌళి జాప్యం మీద సెటైర్లు వేశారు.

ఇదిలా ఉండగా చిరు సైతం భీమ్ ఫర్ రామరాజు వీడియో కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. దానికి స్పందించిన జక్కన్న అంటే సర్..అది కొంచెం..కొంచెం..యాచ్యువల్ గా.. ప్లీజ్ సర్ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సంభాషణలతో ట్విట్టర్ మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ హడావుడే నడుస్తోంది. అభిమానులు, ప్రేక్షకులు సైతం వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారని టీమ్ సభ్యులను అడుగుతున్నారు. ఈ వీడియో సాయంత్రం 4 గంటలకు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More