వీర రాఘవను ప్రశంసించిన రామ్ చరణ్ !

Published on Oct 14, 2018 10:40 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ నటన అలాగే దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్ ఈచిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఫై తన అభిప్రాయాన్ని తన పేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదొక బెస్ట్ పరఫార్మెన్స్ అని త్రివిక్రమ్ డైలాగ్స్ , డైరెక్షన్ సూపర్ అని అన్నారు. అలాగే జగపతి బాబు నటన ,తమన్ మ్యూజిక్ ఈచిత్రానికి మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయని చిత్ర టీం శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి త్వరలోనే నటించనున్నారని తెలిసిందే.

సంబంధిత సమాచారం :