“మోసగాళ్లు” సినిమా చూడమంటున్న చరణ్..!

Published on Mar 20, 2021 11:00 am IST

నిన్న శుక్రవారం విడుదల కాబడిన చిత్రాల్లో మంచు విష్ణు మరియు కాజల్ అగర్వాల్ లు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం “మోసగాళ్లు” కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టి టార్గెట్ తోనే విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ కు గాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన స్పెషల్ కంగ్రాట్స్ ను తెలిపారు.

మొదటగా మోసగాళ్లు టీం అంతటికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాజిటివ్ రెస్పాన్స్ ను నేను కూడా వింటున్నానని విష్ణు మరియు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తన విషెష్ చెప్తూ కాజల్ ను స్పెషల్ గా మెన్షన్ చేసాడు. అంతే కాకుండా ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్ ను ప్రతీ ఒక్కరూ చూడాలని చరణ్ తెలిపాడు. దీనితో విష్ణు కూడా చరణ్ రెస్పాన్స్ ను షేర్ చేసుకున్నాడు. ఈరోజు ఉదయం చరణ్ కాల్ చేసినందుకు చాలా ఆనందంగా అనిపించింది అని ధన్యవాదాలు తెలిపాడు.

సంబంధిత సమాచారం :