
రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు’ సినిమా పూర్తైన వెంటనే, సెప్టెంబర్ లో రామ్ చరణ్ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీను వైట్ల, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమాతో బిజీగా ఉంటె, రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు.

