చరణ్ – సుకుమార్ సినిమాకు ట్యూన్స్ రెడీ..!
Published on Nov 27, 2016 3:42 pm IST

sukumar-with-devisri
విలక్షణ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాతో హిట్ కొట్టిన సుకుమార్, ఈసారి రామ్ చరణ్‌తో విలేజ్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా సుకుమార్ త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం ట్యూన్స్ సమకూర్చే పనిలో ఉన్నారట. ఇప్పటికే రెండు ట్యూన్స్ రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. సుకుమార్-దేవిశ్రీల కాంబినేషన్‌లో ఇప్పటివరకూ వచ్చిన అన్ని బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్‌లానే ఈ ఆల్బమ్ కూడా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించనున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook