శర్వాకి ఇది అలాంటి చిత్రమే – రామ్ చరణ్

Published on Aug 11, 2019 7:32 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు హీరో శర్వానంద్ మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. తన ఫ్రెండ్ కోసం చరణ్.. తాజాగా మీడియా ముందుకొచ్చారు. సుధీర్ వర్మ – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ‘రణరంగం’ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి సౌండ్ కట్ ట్రైలర్ ను ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ…‘సూపర్బ్. .సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది. టెర్రిఫిక్ గా ఉంది. శర్వానంద్ ని ఎలా అయితే చూడాలనుకున్నామో ఈ సౌండ్ కట్ ట్రైలర్ అలా వుంది. ఒక్క మాటలో పర్ఫెక్ట్ గా ఉంది. శర్వానిలో ఉన్న ఇంటెన్సిటీ నాకు బాగా ఇష్టం. ఇక తన సినిమాల్లో కో అంటే కోటి చిత్రం నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన తరువాత నాకు ఇది అలాంటి చిత్రమే అనిపిస్తోంది. ముఖ్యంగా సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాలని చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు’ రామ్ చరణ్.

ఇక సినిమా విషయానికి వస్తే.. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ.

సంబంధిత సమాచారం :