అభిమానుల్ని రిక్వెస్ట్ చేస్తున్న చరణ్ టీమ్ !

17th, April 2017 - 08:31:55 AM


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నైపథ్యంలో సాగే ప్రేమ కథగా ఉండనున్న ఈ చిత్రాన్ని రియలిస్టిక్ గా రూపొందించేందుకు దర్శకుడు సుకుమార్ షూటింగ్ ను చాలా వరకు అవుట్ డోర్ ఒరిజినల్ లొకేషన్లలోనే చేస్తున్నారు. అందుకోసం బయటి రాష్ట్రాలకు వెళ్లకుండా గోదావరి జిల్లాలోనే ఎక్కువ శాతం లొకేషన్లను చూసుకుని చిత్రీకరణ కానిస్తున్నారు.

ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్న టీమ్ రేపటి నుండి కొల్లేరులో షూటింగ్ చేయనుంది ఈ సందర్బంగా చిత్ర టీమ్ అక్కడి స్థానిక అభిమానుల్ని షూటింగుకు ఇలాంటి అంతరాయం కలిగుంచవద్దని, నిర్మాతలు షూటింగ్ భద్రత కోసం అదనపు పోలీస్ బలగాల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారని, ఇతరలకి షూటింగ్ స్పాట్ లోనికి ప్రవేశం లేదని అలాగే అభిమానులు ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయరాదని, చిత్ర యూనిట్ కు పూర్తిగా సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలు పోషిస్తారని అంటున్నారు.