సల్మాన్ ఖాన్ కి రామ్ చరణ్ డబ్బింగ్.!

సల్మాన్ ఖాన్ కి రామ్ చరణ్ డబ్బింగ్.!

Published on Oct 20, 2015 10:03 AM IST

salman-and-ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ కి డబ్బింగ్ చెప్పడం ఏంది అని ఆశ్చర్యపోతున్నారా.. అవాక్కవ్వకండి.. ఎందుకంటే అది నిజంగానే జరగబోతోంది. అలా అని రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ సినిమాకి వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాడు అనుకుంటే పొరబాటే.. ఇక అసలు విషయంలోకి వెళితే.. సల్మాన్ ఖాన్ హీరోగా సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ప్రేమ్ రతన్ దన్ పాయో’. దీపావళి కానుకగా ఈ సినిమాని నవంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ చిత్ర నిర్మాతలైన రాజశ్రీ ప్రొడక్షన్స్ వారు, సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

అనుకున్నదే తడవుగా సల్మాన్ ఖాన్ తన పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పడం కోసం రామ్ చరణ్ ని అప్రోచ్ అయ్యాడు. ఎప్పటి నుంచి సల్మాన్ ఖాన్ తో చిరు ఫ్యామిలీకి సత్సంబందాలు ఉన్నాయి. అలాగే ఓ చక్కని కుటుంబకథా చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కూడా మంచిదే అని భావించిన రామ్ చరణ్ వెంటనే సల్మాన్ ఖాన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే కాకుండా రిలీజ్ కి ఇంకా 20 రోజులే ఉండడం వలన రామ్ చరణ్ ఈ రోజు నుంచే సల్మాన్ ఖాన్ రోల్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెడుతున్నాడు. గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ – సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమా తెలుగులో ప్రేమ పావురాలు గా డబ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది.

ఇప్పుడే అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ఆ రేంజ్ సక్సెస్ సాధిస్తుందని ఈ చిత్ర టీం బావిస్తోంది. త్వరలోనే ఈ చిత్ర టీం తెలుగు వెర్షన్ కి టైటిల్ ని ఫిక్స్ చేసి అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు