జీఈఎస్ లో ప్రసంగించనున్న రామ్ చరణ్ !
Published on Nov 26, 2017 11:05 am IST

త్వరలో హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) లో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పాల్గొననున్నారు. సుమారు 170కి పైగా దేశాల నుండి 1500 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ సదస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.

ఈ సదస్సులో నూతన ఆవిష్కర్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, సినీ తారలు పాల్గొననుండగా సినిమా భవిష్యత్తుపై జరిగే చర్చల్లో రామ్ చరణ్ పాల్గొని, ఉపన్యాసం కూడా ఇవ్వనున్నారు. ఆయనతో పాటి సినీనటి అదితిరావ్ హైదరి కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. ప్రస్తుతం చరణ్ సుకుమార్ డైరెక్షన్లో ‘రంగస్థలం 1985’ చేస్తూనే బోయపాటి సినిమాకు సిద్దమవుతున్నారు.

 
Like us on Facebook