ట్విట్టర్‌లోకి రామ్ చరణ్ రీఎంట్రీ ?

Published on Mar 25, 2020 9:00 pm IST

మెగా హీరోలందరూ సోషల్ మీడియాపై గట్టిగానే గురిపెట్టారు. అందరూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అందరు మెగా హీరోలు ట్విట్టర్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మెగా హీరోల్లో ట్విట్టర్ వరకు బాకీ ఉన్నది రామ్ చరణే. నిజానికి ట్విట్టర్ మాధ్యమం వచ్చిన కొత్తలోనే చాలామంది హీరోల కంటే ముందే చెర్రీ అందులో ఖాతా ఓపెన్ చేశారు. కానీ కొన్ని కారణాల రీత్యా అప్పట్లో అకౌంట్ సస్పెండ్ చేసుకున్నారు.

ఛాన్నాళ్ల నుండి అయన ఫ్యాన్స్ ట్విట్టర్లోకి రమ్మని చెర్రీని కోరుతున్నారు. పైగా చిరు సైతం ఈరోజు ఎంట్రీ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ సైతం మళ్లీ ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పాత ఖాతానే మళ్లీ రీస్టార్ట్ చేస్తారని టాక్. అది కూడా తన పుట్టినరోజైన మార్చ్ 27నాడే అంటున్నారు. అయితే ఈ అంశమై చెర్రీ నుండి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం చరణ్ ట్విట్టర్లో అందుబాటులోకి వస్తారనే ఆశిస్తున్నారు. చూడాలి మరి వారి ఆశ ఎంతవరకు ఫలిస్తుందో.

సంబంధిత సమాచారం :

X
More