మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్ !
Published on Nov 5, 2016 11:33 am IST

dhruva
మెగా అభిమానులు ఎంతాగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్రర్మ్ చరణ్ చేస్తున్న ‘ధృవ’ కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా చరణ్ సరైన హిట్ లేక వెనుకబడటంతో మెగా అభిమానులంతా ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశలకు, అంచనాలకు తగ్గట్టే చరణ్ కూడా కంప్లీట్ గా లుక్ మార్చేసి పూర్తి కాన్ఫిడెంట్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్ వంటివి సినిమాపై ఉన్న క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. దీంతో పాటే నిన్న ఏమాత్రం సందడి లేకుండా రెండు పాటల ప్రోమోలను రిలీజ్ చేశారు చరణ్ టీమ్.

వీటిలో ఒకటి ‘చూశా.. చూశా..’ కాగా మరొకటి ‘నీతోనే డాన్స్ డాన్స్.. ‘ అనే పాట. ఈ రెండు పాటల్లోనూ ముఖ్యంగా ‘నీతోనే డాన్స్’ అనే పాటలో ఆ 10 సెకన్ల పాటు చరణ్ వేసిన ఫాస్ట్ బీట్ స్టెప్పులు అభిమానులకు కనుల విందు చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి అభిమానులు ఎక్కువగా ఆశించేది డాన్సులనే కాబట్టి చరణ్ ఆ విషయంలో ఎటువంటి లోటూ చేయలేదని ఈ ప్రోమోలతో తెలిసిపోతోంది. వీటి పుణ్యమా అని సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్త పెరిగాయి. హిపాప్ తమీజా సంగీతం కూడా చాలా కొత్తగా చాలా బాగుంది. ఇకపోతే ధృవ ఆడియో నవంబర్ 9న డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదలవుతుండగా సినిమా డిసెంబరు 2న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook