ఇస్మార్ట్ శంకర్ కాంబో మరో మారు…!

Published on Nov 9, 2019 3:06 pm IST

డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ల ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించింది. పూరి, రామ్ లను హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రంగా ఇస్మార్ట్ శంకర్ నిలిచిపోయింది. 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నిర్మాత ఛార్మికి కాసుల పంట పండించింది. దీనితో ఈ టీం మరో మారు కలిసి సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారట. హీరో రామ్ రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సంగతి తెలియజేశాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, మీ సమాధానం ఏమిటీ.., అని అడుగగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కావచ్చు, లేదా ప్రీక్వెల్ కావచ్చు, త్వరలోనే మేము మళ్ళీ సినిమా చేయడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉంది, ఇంకా ఏమి ఫైనల్ కాలేదు. అందుకే నేను ఇంత కంటే ఎక్కువ ఏమీ చెప్పలేను. కానీ ఖచ్చితంగా కొద్దిరోజులలో సినిమా చేస్తున్నాం అని ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే తమిళ హిట్ మూవీ తాడం తెలుగు రీమేక్ రెడ్ చిత్రంలో నటిస్తున్నట్లు రామ్ ప్రకటించారు. ఇటీవలే ఈ మూవీ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More